నెలకొకటి అంటున్న సమంత !

నెలకొకటి అంటున్న సమంత !

 

సౌత్ స్టార్ హీరోయిన్ సమంత ఒకవైపు పెద్ద హీరోల సరసన నటిస్తూనే మరోవైపు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కూడా చేస్తున్నారు.  ప్రెజెంట్ ఆమె చేసిన మూడు సినిమాలు విడుదలకు రెడీ అవుతున్నాయి.  వాటిలో ఒకటి తమిళ చిత్రం కాగా మిగతా రెండు తెలుగు సినిమాలు.  తమిళంలో ఆమె చేసిన 'సూపర్ డీలక్స్' మార్చి 29న విడుదలకానుండగా ఏప్రిల్ 5వ తేదీన నాగచైతన్యతో కలిసి నటించిన 'మజిలీ' ప్రేక్షకుల్ని పలకరించనుంది.  ఇక వేసవికి నందినిరెడ్డి డైరెక్షన్లో చేసిన 'ఓ బేబీ' చిత్రం విడుదలకానుంది.  ఇలా సమంత నుండి నెలకొకటి చొప్పున సినిమా వస్తుండటంతో ఆమె అభిమానులు చాలా ఎగ్జైటెడ్ గా ఉన్నారు.