మూడో టెస్ట్: ముందుగానే నిలిచిపోయిన తొలిరోజు ఆట.. కారణం ఇదే..?

మూడో టెస్ట్: ముందుగానే నిలిచిపోయిన తొలిరోజు ఆట.. కారణం ఇదే..?

మూడు టెస్ట్‌ల సిరీస్‌ను ఇప్పటికే 2-0 తేడాతో కైవసం చేసుకున్న టీమిండియా.. రాంచీ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతోన్న మూడో టెస్ట్‌తో విజయం సాధించిన సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయాలన్న పట్టుదలతో ఉంది. మరోవైపు ఈ ఒక్క టెస్ట్‌ అయినా గెలిచిన పరువు నిలుపుకోవాలని దక్షిణాప్రికా ప్రయత్నిస్తోంది. ఇక ఇవాళ మ్యాచ్ వెలుతురు సరిగా లేని కారణంగా 30 ఓవర్ల ముందుగానే నిలిచిపోయింది. వెలుతురు సరిగా లేకపోవడంతో తొలిరోజు ఆటను ముందుగానే నిలిపివేస్తున్నట్టు ఎంపైర్లు ప్రకటించారు. మరోవైపు తొలిరోజు భారత్ జోరు చూపించింది.. 39 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయినా రోహిత్ శర్మ, రహానే ఆదుకున్నారు. 

కష్టాల్లో ఉన్న టీమిండియాను తన సెంచరీతో ఆదుకున్నాడు హిట్‌మ్యాన్‌. ఈ సిరీస్‌లో రోహిత్‌కిది మూడో సెంచరీ. ఓవరాల్‌గా ఆరో సెంచరీ. ఈ సిరీస్‌లో ఓపెనర్‌గా దిగిన రోహిత్ చెలరేగుతున్నాడు. లిమిటెడ్ క్రికెట్‌ ఓపెనర్‌గా సక్సెస్‌ అయిన రోహిట్‌ ఈసిరీస్‌లోనూ సత్తా చాటాడు. నాలుగో వికెట్‌గా వచ్చిన రహానేతో కలిసి ఇన్నింగ్స్‌ని చక్కదిద్దాడు రోహిత్‌. ఈ ఇద్దరు అజేయంగా నాలుగో వికెట్‌కు వంద పరుగుల పార్టనర్‌షిప్‌ని నమోదు చేశారు. మ్యాచ్ ముగిసే సమయానికి మూడు వికెట్ల నష్టానికి టీమిండియా 224 పరుగులు చేయగా.. రోహిత్ శర్మ 117 పరుగులతో.. రహానే 83 పరుగులతో క్రీజులో ఉన్నారు. మొత్తానికి తొలిరోజు మ్యాచ్‌పై భారత్‌ను పట్టు బిగించింది. సౌతాఫ్రికా బౌలర్లలో రబాడా 2 వికెట్లు తన ఖాతాలో వేసుకుంటే.. హెన్రిచ్ 1 ఇక వికెట్ తీశాడు. ఇక, రేపు రెండో రోజు ఆట కొనసాగనుంది.