'బద్లా' ట్రైలర్ విడుదల

'బద్లా' ట్రైలర్ విడుదల

అమితాబ్ బచ్చన్, తాప్సీ పన్ను ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమా 'బద్లా'. సుజాయ్ ఘోష్ దర్శకత్వం వహించిన ఈ సినిమా సస్పెన్స్, థ్రిల్లర్ గా తెరకెక్కించారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ విడుదలైంది. ట్రైలర్ తో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మార్చి 8న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

వ్యాపారవేత్త అయిన ఓ మహిళ (తాప్సీ) మరో వ్యక్తితో కలిసి ఓ హోటల్ లో ఉంటుంది. ఆమెను ఎవరో తలపై కొట్టగా స్పృహ కోల్పోతుంది. లేచి చూసేసరికి తనతో పాటు వచ్చిన వ్యక్తి మృతిచెంది ఉంటాడు. కేసు ఆమెపై పడడంతో.. లాయర్ (అమితాబ్) సహాయం కోరుతుంది. ఆ తరువాత ఏం జరిగిందనేదే సినిమా.