ఘనంగా సిక్కి రెడ్డి వివాహం

ఘనంగా సిక్కి రెడ్డి వివాహం

భారత బ్యాడ్మింటన్‌ స్టార్ నేలకుర్తి సిక్కి రెడ్డి వివాహం హైదరాబాద్‌లో శనివారం రాత్రి ఘనంగా జరిగింది. చిరకాల మిత్రుడు, సహచర ప్లేయర్ అయిన సుమీత్ రెడ్డితో సిక్కి రెడ్డి వివాహం జరిగింది. చాలా కాలంగా ప్రేమలో ఉన్న ఈ ఇద్దరు ఇంట్లోవాళ్లను ఒప్పించి వివాహబంధంతో ఒక్కటయ్యారు. ఈ వివాహంకు తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్, కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. భారత బ్యాడ్మింటన్‌ స్టార్స్‌ సైనా నెహ్వాల్, పీవీ సింధులు కూడా ఈ పెళ్లికి హాజరయ్యారు.