ఏపీఎస్‌ఆర్టీసీ ప్రయాణికులకు బ్యాడ్‌ న్యూస్‌

ఏపీఎస్‌ఆర్టీసీ ప్రయాణికులకు బ్యాడ్‌ న్యూస్‌

ఏపీఎస్‌ఆర్టీసీలో సమ్మె సైరన్‌ మోగింది. జూన్‌ 13 నుంచి నిరవధిక సమ్మె చేయాలని ఏపీఎస్‌ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ నిర్ణయించింది. ఈమేరకు ఎంప్లాయీస్‌ జేఏసీ కన్వీనర్‌ దామోదర్‌ విజయవాడలో ప్రకటించారు. కార్మికుల వేతన సవరణ బకాయిలు చెల్లింపుసహా 27 డిమాండ్ల సాధనే లక్ష్యంగా  సమ్మెకు దిగుతున్నట్లు వివరించారు. నిన్న జరిగిన చర్చల్లో దాటవేత ధోరణితో యాజమాన్యం మాట్లాడిందన్న జేఏసీ నేతలు.. రాష్ట్రంలో అసలు కార్మికశాఖ ఉందా అనేది అనుమానంగా ఉందని అన్నారు.  ఇక.. ఈ నెల 28, 29 తేదీల్లో సమ్మె సన్నాహక ధర్నాలు, జూన్ మొదటివారం బహిరంగ సభలు నిర్వహిస్తామని చెప్పానరు. సమ్మెను అణచివేయాలని చూస్తే సహాయనిరాకరణ ఉద్యమం చేస్తామని స్పష్టం చేశారు.