ప్రియాంకను విడుదల చేసినా...

ప్రియాంకను విడుదల చేసినా...

పశ్చిమ బెంగాల్‌ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సీఎం మమతా బెనర్జి ఫోటోను మార్ఫింగ్‌ చేసిన బీజేపీ కార్యకర్త ప్రియాంక శర్మను వెంటనే విడుదల చేయాలని, లేకుంటే కోర్టు ఉత్తర్వుల ధిక్కరణ కింద కేసు నమోదు చేస్తామని సుప్రీం కోర్టు ఇవాళ హెచ్చరించింది.  ప్రియాంకను విడుదల చేయాల్సిందిగా నిన్న సుప్రీం కోర్టు పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే శర్మను విడుదల చేసేందుకు సిద్ధమైన రాష్ట్ర పోలీసులు.... క్షమాపణలతో పాటు మున్ముందు ఇలాంటి మార్ఫింగులు చేయనని హామి ఇస్తూ సంతకం పెట్టాలని కోరడం ఆమె ససేమిరా అన్నారు. దీంతో ఆమె నిన్న విడుదల కాలేదు. అయితే ఇవాళ కోర్టు విచారణ జరుగుతుండగా శర్మను విడుదల చేసినట్లు ఆమె తరఫు లాయర్‌ కౌల్‌ కోర్టుకు తెలిపారు. అయితే తాను క్షమాపణ చెబుతూ సంతకం తీసుకున్నారని, దీనిపై తాము సుప్రీం కోర్టులో పిటీషన్‌ వేస్తామని చెప్పారు. అయితే ఆ కేసు జులై  మొదటివారంలో విచారిస్తామని కోర్టు పేర్కొంది.