టీడీపీతో పొత్తుపై బైరెడ్డి ఏమన్నారంటే..

 టీడీపీతో పొత్తుపై బైరెడ్డి ఏమన్నారంటే..

తెలంగాణ ఎన్నికల్లో ఏపీ సీఎం చంద్రబాబు వాడిన డైలాగులను అక్కడి ఓటర్లు నమ్మలేదని రాయలసీమ కాంగ్రెస్ నాయకులు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో తమ పార్టీ ఓటమికి టీడీపీతో పోత్తే కారణమని స్పష్టం చేశారు. ఏపీలో కూడా టీడీపీతో కాంగ్రెస్ జత కలిస్తే తెలంగాణలో వచ్చిన ఫలితాలే రిపీట్ అవుతాయని జోస్యం చెప్పారు. పొత్తు పెట్టుకుంటే కాంగ్రెస్ పార్టీ నిండా మునగడం ఖాయమని అన్నారు. రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ, పార్లమెంట్ స్ధానాల్లో కాంగ్రెస్ ఒంటరిగానే పోటీ చేస్తుందని బైరెడ్డి తెలిపారు.