మార్కెట్ లోకి కొత్త బజాజ్‌ చేతక్‌...మీరు చూశారా ?

మార్కెట్ లోకి కొత్త బజాజ్‌ చేతక్‌...మీరు చూశారా ?

ఒకప్పుడు ఇండియన్ టూ వీలర్ మార్కెట్ ని మకుటం లేని రాజుగా ఏలిన వాహన తయారీ కంపెనీ బజాజ్ ఆటో లిమిటెడ్‌ ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) విభాగంలోకి ఎంట్రీ ఇచ్చింది.  తన పాపులర్‌ మోడల్‌ చేతక్‌ స్కూటర్‌ను సరికొత్తగా ఎలక్ట్రిక్ స్కూటర్ గా మార్కెట్‌లో నేడు లాంచ్ చేసింది. బజాజ్ ట్యాగ్‌లైన్ 'హుమారా బజాజ్' గా 'హుమారా కల్' అనే కొత్త నినాదంతో తక్ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ను అర్బనైట్ ఈవీ బ్రాండ్ కింద తీసుకొచ్చింది. కంపెనీ చాకన్ ప్లాంట్‌లో ఈ స్కూటర్‌ను రూపొందిస్తున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. కొత్త చేతక్‌ రెండు వేరియంట్లలో లభించనుండగా ఈ స్కూటర్ ధరను మాత్రం ఇంకా ప్రకటించలేదు. మోటారు సైకిళ్ల మార్కెట్ పై దృష్టి పెట్టడానికి బజాజ్ 2009లో సాంప్రదాయ స్కూటర్ల తయారీని నిలిపివేసింది బజాజ్‌. ఈ స్కూటర్లు 2020 జనవరిలో మార్కెట్‌లోకి రానున్నాయి.