బజాజ్ పల్సర్ బైక్స్ మరో కొత్త రికార్డు 

 బజాజ్ పల్సర్ బైక్స్ మరో కొత్త రికార్డు 

బజాజ్ పల్సర్ బైక్స్ మరో కొత్త రికార్డ్ సాధించాయి. ఒక్క నెలలోనే ఏకంగా లక్షకు పైగా యూనిట్ల విక్రయాలతో మార్కెట్ లో దూసుకుపోతోంది. ఇప్పటి వరకు నెలకు సగటున 45 వేల నుంచి 60 వేల మధ్య పల్సర్ బైక్‌లు అమ్ముడుపోగా మార్చినెలలో ఏకంగా లక్షకుపైగా విక్రయాలతో సంచలనం సృష్టించింది. 2018 మార్చితో పోలిస్తే ఈ మార్చిలో విక్రయాలు ఏకంగా 39 శాతం పెరిగాయి. ఇతర కంపెనీల టూవీలర్ అమ్మకాలు అంతంత మాత్రంగా ఉన్నా కూడా బజాజ్ పల్సర్ విక్రయాలు భారీగా పెరగడం విశేషం. బజాజ్‌ తొలిసారి పల్సర్‌ బ్రాండ్‌ను 2001లో మార్కెట్లోకి తీసుకొచ్చింది. 150సీసీ-220సీసీ సెగ్మెంట్‌లో దీనిని విక్రయాలను చేపట్టింది. ఈ మధ్యలో పలు అప్‌గ్రేడ్‌ వెర్షన్లను తీసుకొచ్చింది. 108సీసీ, 220ఎఫ్‌, ది ఆర్‌ఎస్‌, ఎన్‌ఎస్‌200 మోడళ్లను ప్రవేశపెట్టింది. 150 సీసీ నుంచి క్రమంగా 220 సీసీ వరకు చేరుకుని బైక్ మార్కెట్లో దుమ్ము రేపుతోంది.