పెరగనున్న బజాజ్‌ టూవీలర్స్‌ ధరలు

 పెరగనున్న బజాజ్‌ టూవీలర్స్‌ ధరలు

వాహనాల్లో టెక్నాలజీపరంగా పలు మార్పులు తెస్తున్నామని, దీనివల్ల టూ వీలర్స్‌ ధరలు రూ. 4000 నుంచి రూ. 10,000  వరకు పెరిగే అవకాశముందని బజాజ్‌ ఆటో మేనేజింగ్‌ డైరెక్టర్‌ రాజీవ్‌ బజాజ్ వెల్లడించారు. వచ్చే ఏడాది యాంటిలాక్‌ బ్రేకింగ్‌ వాహనాలను ప్రవేశపెడుతున్నామని, దీంతో ధరలు పెరుగుతాయని ఆయన అన్నారు. స్కూటర్‌ రంగంలో ప్రవేశించే ఉద్దేశం లేదని, అయితే ఎలక్ర్టిక్‌ స్కూటర్స్‌ను తప్పక తీసుకు వస్తామని అన్నారు. 2020కల్లా ఎలక్ట్రిక్‌ టూ, త్రీ వీలర్స్‌ తీసుకు వస్తామని అన్నారు. ప్రీమియం  వెహికల్స్‌కు డిమాండ్‌ 25 శాతం చొప్పున పెరుగుతోందన్నారు. ఎంట్రీ లెవల్లో అమ్మకాలు భారీగా ఉన్నాయని రాహుల్‌ బజాజ్‌ అన్నారు. ఈ విభాగంలో తమ కంపెనీ వృద్ధి రేటు 60 శాతం ఉందని అన్నారు. త్రీ వీలర్స్‌పై ఈజిప్టులో నిషేధం ఉన్నందున... అక్కడ కాస్త ఇబ్బందులు పడుతున్నామని ఆయన చెప్పారు. ఈ ఏడాది 20 దేశాలకు 20 లక్షల వాహనాలను అమ్మినట్లు ఆయన చెప్పారు.