కీలక భద్రతా విభాగాలకు కొత్త చీఫ్‌లు

కీలక భద్రతా విభాగాలకు కొత్త చీఫ్‌లు

‘రీసెర్చ్‌ అండ్‌ అనాలసిస్ వింగ్‌’ (రా) చీఫ్‌గా సామంత్‌ గోయెల్‌, ఇంటెలిజెన్స్‌ బ్యూరో(ఐబీ) డైరెక్టర్ గా అరవింద్‌ కుమార్‌ ను నియమిస్తూ ప్రధాని మోడీ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ ఇద్దరు 1984 ఐపీఎస్ బ్యాచ్ కి చెందిన అధికారులు. గోయెల్ పంజాబ్ కేడర్, అరవింద్ కుమార్ అస్సాం- మేఘాలయా కేడర్ కు చెందిన అధికారులు. సామంత్‌ గోయెల్‌ గత ఫిబ్రవరిలో బాలాకోట్‌పై వైమానిక దాడులు, 2016 మెరుపు దాడుల వ్యూహ రచనలో కీలకంగా వ్యవహరించారు. 1990లో పంజాబ్‌లో చెలరేగిన తీవ్రవాదాన్ని సమర్థంగా ఎదుర్కొన్న వ్యక్తిగా సామంత్‌కు మంచి పేరుంది. ఐబీ చీఫ్‌గా ఎన్నికైన అరవింద్‌ కుమార్‌ వామపక్ష తీవ్రవాదాన్ని నిరోధించడంలో కీలకంగా పనిచేశారు.