'ఎన్టీఆర్' ఎందుకు ఫ్లాపైందో తెలుసుకుంటారట !

'ఎన్టీఆర్' ఎందుకు ఫ్లాపైందో తెలుసుకుంటారట !

 

నందమూరి బాలకృష్ణ కెరీర్లో ఫ్లాప్ సినిమాలున్నాయి.. డిజాస్టర్లు ఉన్నాయి.  కానీ 'ఎన్టీఆర్' బయోపిక్ లాంటి పరాజయం మాత్రం లేదు.  ఈ సినిమా మీద బోలెడన్ని ఆశలు పెట్టుకుని సొంత నిర్మాణ సంస్థను స్థాపించి మరీ ఈ సినిమా తీశాడు బాలకృష్ణ.  కానీ ఊహించని రీతిలో ఫెయిల్యూర్ ఎదురైంది.  సొంత అభిమానులు సైతం మొదటిరోజు థియేటర్లకు రాకపోవడం ఆయన్ను ఆలోచింపజేసింది.  అందుకే అసలు సమస్య ఎక్కడుంది, సినిమా పరాజయానికి కారణం ఏమిటో తెలుసుకునే పని మొదలుపెట్టారు.  తన అభిమాన సంఘాలను పిలిచి తప్పు ఎక్కడ జరిగిందో విశ్లేషిస్తారట.