బాలయ్యతో సాయి ధరమ్ పోటీకి సై..!!

బాలయ్యతో సాయి ధరమ్ పోటీకి సై..!!

వచ్చే ఏడాది సంక్రాంతికి తీవ్రమైన పోటీ ఉన్నది.  సంక్రాంతికి దాదాపుగా ఐదు సినిమాలు పోటీ పోటీపడుతున్నాయి.  రజినీకాంత్ దర్బార్ సినిమా ఇప్పటికే డేట్ ఫిక్స్ చేసుకుంది.  జనవరి 10 వ తేదీన వచ్చేందుకు సిద్ధం అయ్యింది.  ఈ సినిమా తరువాత వెంకిమామ, సరిలేరు నీకెవ్వరూ, అల వైకుంఠపురంలో, ఎంత మంచివాడవురా ఇలా వరసగా లైన్లో ఉన్నాయి.  సంక్రాంతికి రావాలని అనుకున్న బాలయ్య 105 వ సినిమాను డిసెంబర్ లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.  అనధికారిక సమాచారం ప్రకారం డిసెంబర్ 20 వ తేదీన రిలీజ్ చేయబోతున్నట్టు తెలుస్తోంది.  

ఒకవేళ ఆ డేట్ కన్ఫర్మ్ అయితే.. అదే రోజున మారుతి దర్శకత్వంలో రాబోతున్న సాయిధరమ్ తేజ్ సినిమా ప్రతి రోజు పండుగే సినిమా కూడా రిలీజ్ కాబోతున్నది.  చిత్రలహరి వంటి డీసెంట్ హిట్ తరువాత సాయి ధరమ్ తేజ్ చేస్తున్న సినిమా కావడంతో దీనిపై అంచనాలు ఉన్నాయి.  అలానే, గీత ఆర్ట్స్ సంస్థ నుంచి వస్తున్నది కాబట్టి కథలో తప్పకుండా డెప్త్ ఉంటుంది.  డిసెంబర్ 20 వ తేదీన సినిమాను రిలీజ్ చేస్తున్నట్టుగా గీత ఆర్ట్స్ సంస్థ ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. 

బాలకృష్ణ 105 వ సినిమాకు కూడా మంచి హైప్ వచ్చింది.  ఇందులో బాలకృష్ణ కొత్తగా కనిపిస్తున్నారు.  కొత్త లుక్ తో కనిపించడంతో ఈ సినిమాపై కూడా హోప్స్ పెరుగుతున్నాయి. రెండు సినిమాలు ఒకే రోజున రిలీజైతే.. మిగతా చిన్న చిన్న సినిమాలు వాయిదా వేసుకోక తప్పదు. ఇక అదే రోజున మాస్ మహారాజ రవితేజ డిస్కోరాజా సినిమా కూడా రిలీజ్ కాబోతున్నది.  మరి ఈ మూడింటిలో ప్రేక్షకులు ఏ సినిమాను ఆదరిస్తారో చూడాలి.