బాలయ్య.. బోయపాటి సినిమాకు కొత్త చిక్కులు... 

బాలయ్య.. బోయపాటి సినిమాకు కొత్త చిక్కులు... 

బాలకృష్ణ 105 వ సినిమా రూలర్ పూర్తికావొచ్చింది.  ఈ సినిమా వచ్చే నెల నుంచి బోయపాటి మూవీకి సంబంధించిన సినిమా ప్రారంభమ వుంటుంది.  బోయపాటి.. బాలయ్య మూవీలో ఇద్దరు హీరోయిన్లు ఉంటారట.  ఈ ఇద్దరు హీరోయిన్ల కోసం బోయపాటి అండ్ కో ట్రై చేస్తున్నారు.  ఎవర్ని ఇందులో హీరోయిన్లుగా తీసుకోవాలి అన్నది బోయపాటి ముందున్న ప్రశ్న.  

గతంలో ఇద్దరు సీనియర్ హీరోయిన్లను లెజెండ్ సినిమాకోసం తీసుకున్నారు.  ఇప్పుడు మరలా వారినే తీసుకోవాలి అంటే కుదరదు.  కొత్త హీరోయిన్ల కోసం బోయపాటి ట్రై చేస్తున్నాడు.  కన్నడ నటి రచిత రామ్ ను ఈ సినిమా కోసం సంప్రదించారని ఒక సమాచారం.  కానీ, తనను ఎవరూ కూడా సంప్రదించలేదని, రచిత చెప్తోంది.  ఇక ఇదిలా ఉంటె, ఈ సినిమాలో విలన్ గా బాలీవుడ్ స్టార్ నటుడు, హీరో సంజయ్ దత్ తీసుకోబోతున్నారు.