పవన్-బాలయ్య అరుదైన కలయిక... నెట్టింట్లో వైరల్

పవన్-బాలయ్య అరుదైన కలయిక... నెట్టింట్లో వైరల్

తెలుగు సినిమా ఇండస్ట్రీలో బాలకృష్ణకు ఎలాంటి పేరు ఉన్నదో చెప్పక్కర్లేదు.  బాలయ్యబాబు ఇప్పటి వరకు 105 సినిమాలు చేశారు.  అయితే, నందమూరి, మెగా ఫ్యామిలీ మధ్య పెద్దగా సయోధ్యలేదు అని చెప్పాలి.  ఈ జనరేషన్ రామ్ చరణ్, ఎన్టీఆర్ లు మంచి స్నేహితులు అయ్యారు.  ఈ ఇద్దరు కలిసి ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్నారు.  ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతున్నది.  

బాలకృష్ణ, మెగాస్టార్ చిరంజీవి కలిసి ఒక్క సినిమా కూడా చేయలేదు. బాలయ్య... మెగాస్టార్ మధ్య సినిమా వార్ తప్పించి పర్సనల్ గా ఎలాంటి వార్ లేదు.  పవన్ కళ్యాణ్... బాలకృష్ణ మధ్య కూడా ఎలాంటి ఇబ్బందులు లేవు.  ప్రస్తుతం ఈ ఇద్దరు రాజకీయంగా ప్రత్యర్ధులు.  రాజకీయాల్లో దూసుకుపోతున్నారు.  బాలకృష్ణ హిందూపురం ఎమ్మెల్యేగా ఉంటె,  పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు.  అయితే, పవన్ కళ్యాణ్ సుస్వాగతం సినిమా ఓపెనింగ్ కోసం బాలకృష్ణ చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు.  ఆ వేడుకకు వెంకటేష్, చిరంజీవి కూడా హాజరు కావడం విశేషం.  ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నది.