లాబీల్లో ఎదురుపడ్డ బాలకృష్ణ, రోజా

లాబీల్లో ఎదురుపడ్డ బాలకృష్ణ, రోజా

అసెంబ్లీ లాబీల్లో ఇవాళ టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ, వైసీపీ ఎమ్మెల్యే రోజా ఎదురుపడ్డారు. బాగున్నారా.. అంటూ పరస్పరం పలకరించుకున్నారు. అంతకముందు లాబీల్లో కనిపించిన రోజాను సెల్ఫీల కోసం వైసీపీ కార్యకర్తలు చుట్టుముట్టారు. కార్యకర్తల సందడి ఎక్కువగా ఉండడంతో సభలోకి వెళ్లడానికి టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు ఇబ్బంది పడ్డారు. మార్షల్స్ దారి చూపడంతో ఆయన సభలోకి వెళ్లగలిగారు.