తెలంగాణ పోలీసులకు బాలయ్య అభినందనలు 

తెలంగాణ పోలీసులకు బాలయ్య అభినందనలు 

తెలంగాణలో దిశ నిందితులపై ఎన్ కౌంటర్ జరిగింది.  విచారణ జరిపేందుకు పోలీసులు నలుగురు నిందితులను చటాన్ పల్లి ఫ్లైఓవర్ వద్దకు తీసుకెళ్లారు.  అలా తీసుకెళ్లి విచారణ చేయబోతుండటంతో అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు వారిని ఎన్ కౌంటర్ చేశారు.  నిందితులను ఎన్ కౌంటర్ చేయడంపై దేశంలోని ప్రజలందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలతో పాటుగా సెలెబ్రిటీలు కూడా పెద్ద ఇటున ట్విట్టర్ లో స్పందించారు.  

దీంతో పాటుగా బాలకృష్ణ కూడా ఈ విషయంపై స్పందించారు.  ఈరోజు బాలకృష్ణ 106 వ సినిమా ప్రారంభమైంది.  ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో బాలయ్య మాట్లాడారు.  దిశ హత్యకేసు నిందితుల ఎన్ కౌంటర్ పై బాలకృష్ణ మాట్లాడారు.  దిశ హత్య కేసు విషయంలో తెలంగాణ పోలీసులు తీసుకున్న నిర్ణయం సరైనదని అన్నారు.  దేశంలో మరోచోట ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని అన్నారు.  భగంవతుడే పోలీసుల రూపంలో వచ్చి అమ్మాయికి న్యాయం చేశారని, ఈ సంఘటన చూసిన తరువాత మిగతా వాళ్ళు భయపడతారని, ఇలాంటి ఘటనలు మళ్ళీ జరగకుండా ఉండాలని కోరుకుంటున్నట్టు బాలయ్య పేర్కొన్నారు.