ఒకే వేదికపై బాలయ్య, ఎన్టీఆర్ !

ఒకే వేదికపై బాలయ్య, ఎన్టీఆర్ !

తారక్ నటించిన తాజా చిత్రం 'అరవింద సమేత' భాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని దక్కించుకుంది.  సినిమా వసూళ్లు భారీ స్థాయిలో ఉన్నాయి.  త్రివిక్రమ్ రచన, దర్శకత్వం, ఎన్టీఆర్ నటన కలిసి చిత్రాన్ని ఆకట్టుకునేలా తయారుచేశాయి.  

ఈ విజయాన్ని సెలబ్రేట్ చేసుకునేందుకు చిత్ర యూనిట్ ఈరోజు భారీ స్థాయిలో విజయోత్సవ వేడుకను  చేయనున్నారు.  దీనికి ఎన్టీఆర్ బాబాయ్ నందమూరి బాలక్రిష్ణ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.  చాన్నాళ్ల తరవాత బాబాయ్, అబ్బాయ్ ఇలా ఒకే వేదిక మీద కనిపించనుండటంతో అభిమానుల్లో నూతనోత్సాహం నెలకొంది.