ఏ పని చేయాలన్నా నాన్నగారే ఆదర్శం...

ఏ పని చేయాలన్నా నాన్నగారే ఆదర్శం...

నాకు ఏ పనిచేయాలన్నా నాన్నగారు స్వర్గీయ నందమూరి తారకరామారావే ఆదర్శం అన్నారు నందమూరి బాలకృష్ణ... హైదరాబాద్‌లోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ 18వ వార్షికోత్సవ వేడుకల్లో ఆయన మాట్లాడుతూ... మేం ఒకరి ట్రెండ్‌సెట్ ఫాలో కాము... మేమే ట్రెంట్ సెట్‌ చేస్తామన్నారు. మా అమ్మ క్యాన్సర్ వ్యాధిలో మరణింస్తే ఆమె కోరిక మేరకు బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిని నాన్నగారు ప్రారంభించారని గుర్తు చేసిన ఆయన... 40 పడకలతో ప్రారంభించిన ఆస్పత్రి 500కి పైగా పడకలకు ఎదిగిందని వెల్లడించారు. క్యాన్సర్ వ్యాధి కంటే... ఆ భయంతోనే సగం మంది మరణిస్తారు... కానీ, ఆస్పత్రిలో వైద్యులు చూపే ప్రేమకే సగం వ్యాధి పోతుందన్నారు బాలయ్య. 

ఈ సందర్భంగా బెస్ట్ మేనేజ్‌మెంట్ అవార్డు ఇచ్చినందుకు తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు బాలకృష్ణ... ఎన్టీఆర్ ఒక విజన్ తో ఆస్పత్రిని స్థాపించారు... ఎన్టీఆర్ ఆశయాలను ముందుకు తీసుకుపోతున్నామని వెల్లడించారు. ప్రపంచస్థాయిలో ఉన్న అధునాతన పరిజ్ఞానం ఆస్పత్రికి తెస్తున్నామని... కంటికి కనబడని ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ ముందుకు సాగుతున్నామని... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆస్పత్రి ఎదుగుదలకు తోడ్పడుతున్నాయని తెలిపారు. మహిళల కోసం ఎప్పటికప్పుడు ఆస్పత్రిలో స్క్రినింగ్ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. సమాజంలో క్యాన్సర్ ని ఎదురించి గెలిచిన ప్రతీ ఆడబిడ్డకు మా అమ్మ ఆశీర్వాదం ఉందని నేను అనుకుంటానని వ్యాఖ్యానించారు బాలయ్య. తెలుగు రాష్ట్రాల సీఎంలు ఇద్దరు చంద్రులు ఎన్టీఆర్ శిష్యులే అని గుర్తుచేశారు. క్యాన్సర్‌కి ఎవ్వరూ బయపడకండి... అందరికీ బసవతారకం అండగా ఉంటుందని భరోసా కల్పించారు.