ఆ రెండు ప్రశ్నలకు బాలయ్య తెలివైన సమాధానం..!!

ఆ రెండు ప్రశ్నలకు బాలయ్య తెలివైన సమాధానం..!!

ఎన్టీఆర్ బయోపిక్ లో మొదటి భాగం ఎన్టీఆర్ కథానాయకుడు సినిమా రేపు ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతున్నది.  తెలుగుతో పాటు అటు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో కూడా సినిమా రిలీజ్ అవుతున్నది.  ఈ సందర్భంగా ఈ ఉదయం ఎన్టీఆర్ బయోపిక్ టీమ్ సినిమా ప్రమోషన్స్ కోసం బెంగళూరు వెళ్ళింది.  ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా విలేఖరులు అడిగిన ప్రశ్నలకు బాలకృష్ణ సమాధానం చెప్పారు.  

ఎన్టీఆర్ బయోపిక్ లో కథానాయకుడు, మహానాయకుడు సినిమాతో పాటు ఆర్జీవి లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా కూడా వస్తోంది కదా దానిమీద అభిప్రాయం అడిగితె... ఎవరు ఎలాంటి సినిమాలు చేస్తున్నారన్నది ఈ సందర్భంలో అవసరం లేదు.  ఎన్టీఆర్ కథానాయకుడు సినిమా ప్రమోషన్ కోసమే వచ్చానని, రాజకీయాల గురించి మాట్లాడాల్సిన అవసరం లేదని చెప్పారు.  నాగబాబు చేసిన కామెంట్స్ గురించి కూడా బాలకృష్ణ ఎలాంటి సమాధానం చెప్పకుండా సినిమా ప్రమోషన్స్ కోసమే వచ్చానని, రాజకీయాలు చేయడానికి కాదని చెప్పారు.