మహానటి ఎఫక్ట్ - ఎన్టీఆర్ బయోపిక్ లో మార్పులు ?

మహానటి ఎఫక్ట్ - ఎన్టీఆర్ బయోపిక్ లో మార్పులు ?
ఎన్టీఆర్ బయోపిక్ రోజుకో మలుపు తిరుగుతున్నది.  ఎన్టీఆర్ బయోపిక్ ఆలోచనను ఎవరు తీసుకొచ్చిన ఆ కథ అనుకున్నప్పటి నుంచి దర్శకుడు తేజ బాలకృష్ణతో ఉన్నాడు.  ఎన్టీఆర్ బయోపిక్ ను బాలకృష్ణ దర్శకుడు తేజ చేతిలో పెట్టాడు.  కానీ, తేజ ఆ సినిమాకు న్యాయం చేయలేనేమో అని విరమించుకున్నాడు.  
తేజ పక్కకు తప్పుకున్నాక ఎన్టీఆర్ బయోపిక్ అయోమయంలో పడింది.  సినిమా సెట్స్ మీదకు వెళ్తుందా లేదా అనే సందేహంలో ఉన్నది.  సావిత్రి జీవిత కథ ఆధారంగా వచ్చిన మహానటి సినిమా విడుదలయ్యాక బాలకృష్ణలో చాల మార్పు వచ్చినట్టుగా సమాచారం.  అగ్ర దర్శకులకు సాధ్యంకాని దాన్ని ఓ కొత్త దర్శకుడు సాధ్యం చేశాడు. సావిత్రి కథను ముందుండి నడిపించాడు.  మహానటిని అద్భుతంగా తీర్చి దిద్దాడు.  కొత్త దర్శకుడే అద్భుతాలు సృష్టించినపుడు.. అంతటి బలగం, బలం ఉండి ఎన్టీఆర్ బయోపిక్ ను ఎందుకు సమర్ధవంతంగా తీయలేమని బాలకృష్ణ ఆలోచించినట్టు తెలుస్తోంది.  
 
ఎన్టీఆర్ కథను మొదటి నుంచి డీల్ చేసిన తేజను మరోసారి పిలిపించి మాట్లాడాలని బాలకృష్ణ అనుకుంటున్నట్టు సమాచారం.  బాలకృష్ణ పిలిస్తే తేజ తప్పకుండా ఒప్పుకుంటాడు. దర్శకుడికి పూర్తి స్వేచ్ఛను ఇస్తే ఎలాంటి అద్భుతాలు చెయ్యొచ్చో మహానటి స్పష్టంగా తెలిపింది.  ఒకవేళ తేజకు ఎన్టీఆర్ ప్రాజెక్టును అప్పగించి పూర్తి స్వేచ్ఛను ఇస్తే.. మహానటి లాంటి అద్భుతాలు చేస్తాడా..? చూద్దాం.