ఒక బాల‌య్య .. రెండు ఓపెనింగులు

ఒక బాల‌య్య .. రెండు ఓపెనింగులు

శ‌తాధిక చిత్రాల క‌థానాయ‌కుడు, న‌ట‌సింహా నంద‌మూరి బాల‌కృష్ణ అంత‌కంత‌కు దూకుడు పెంచుతున్నారు. ఆయ‌న టైటిల్ పాత్ర‌లో క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో ఎన్టీఆర్ బ‌యోపిక్ తెర‌కెక్క‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించిన స‌న్నాహ‌కాల్లో ఉన్న బాల‌య్య వ‌రుస‌గా ఇరువురు ద‌ర్శ‌కుల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌డం, ఆయా సినిమాల ఓపెనింగుల‌కు రెడీ అవుతుండ‌డం ప‌రిశ్ర‌మ‌లో హాట్ టాపిక్ అయ్యింది. 

స్టార్ డైరెక్ట‌ర్లు వి.వి.వినాయ‌క్, బోయ‌పాటితో సినిమాల‌కు ఇదివ‌ర‌కే బాల‌య్య‌ లైన్‌క్లియ‌ర్ చేశారు. మే 28న ఎన్టీఆర్ పుట్టిన‌రోజున వినాయ‌క్ సినిమా లాంచ్ చేయ‌నున్నారు. అలానే జూన్ 10న బాల‌య్య పుట్టిన‌రోజున బోయ‌పాటితో సినిమా ప్రారంభం కానుంద‌ని తెలుస్తోంది. ప్ర‌స్తుతం క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో ఎన్టీఆర్ బయోపిక్‌తో బిజీగా ఉన్న బాల‌కృష్ణ ఆ రెండు సినిమాల్ని అంతే ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తీసుకుని న‌టించ‌నున్నారు. శ‌తాధిక చిత్రాల క‌థానాయ‌కుడిగా బాల‌య్య దూకుడు చూస్తుంటే న‌వ‌త‌రం హీరోలు సైతం విస్తుపోవాల్సిందే.