బాలయ్య కొత్త లుక్ వైరల్ - రజినీలా మారిపోయాడుగా... 

బాలయ్య కొత్త లుక్ వైరల్ - రజినీలా మారిపోయాడుగా... 

బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి సినిమాలో నటిస్తున్నారు.  ఈ సినిమా షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది.  ఈ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు.  అయితే, ఈరోజు టిడిఎల్ఫీ సమావేశం జరిగింది.  ఈ సమావేశానికి బాలకృష్ణ హాజరయ్యారు.  వైట్ అండ్ వైట్ లో ఎవరూ ఊహించని కూడా వచ్చారు.  చూస్తుంటే అసలు బాలయ్యనా కాదా అనే విధంగా ఉన్నారు.  

గుండు గెటప్ లో కొత్తగా కనిపించారు.  ఈ గెటప్ లో బాలయ్య కనిపించడం ఇదే మొదటిసారి.  ప్యూర్ వైట్ డ్రెస్ లో తెల్లని గడ్డంలో చూడటానికి బాలయ్య శివాజీ సినిమాలో గుండుబాస్ రజినీకాంత్ ను తలపించారు.  ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.