అసలు బాలయ్య ఏం చేయబోతున్నారు..!!?

అసలు బాలయ్య ఏం చేయబోతున్నారు..!!?

బాలకృష్ణ ప్రస్తుతం రూలర్ సినిమా చేస్తున్నారు.  రూలర్ టైటిల్ చాలా పవర్ ఫుల్ గా ఉన్నది.  ఈ సినిమాలో బాలకృష్ణ కొత్తగా కనిపిస్తున్నారు.  ఎవరూ ఊహించలేదు.. బాలయ్య అంత స్లిమ్ గా ఉంటాడని.  ఇందులో పోలీస్ ఆఫీసర్ గా బాలకృష్ణ కనిపిస్తుండటం విశేషం.  

ఈ మూవీ క్రిస్మస్ ను సందర్భంగా డిసెంబర్ 20 వ తేదీన రిలీజ్ కాబోతున్నది.  సినిమాపై అంచనాలు ఉన్నాయి.  డిసెంబర్ 20 వ తేదీన బాలయ్య సినిమాలతో పాటు మరికొన్ని సినిమాలు కూడా రిలీజ్ కాబోతున్నాయి.  ఒకవేళ సినిమా హిట్ టాక్ వచ్చింది అంటే.. మాస్ లో ఎలా హిట్ అవుతుందో చెప్పలేం..  ఈ సినిమా తరువాత తనకు చాలా ఇష్టమైన దర్శకుడు బోయపాటితో సినిమా చేస్తున్నారు.  ఈ సినిమాలో డబుల్ రోల్ చేస్తున్నారని తెలుస్తోంది. సింహా, లెజెండ్ లా బోయపాటితో చేయబోతున్న మూడో సినిమా కూడా హిట్ అవుతుందా.. చూడాలి.