వైమానిక దాడిని మెచ్చుకున్న బాలయ్య, ప్రభాస్ !

వైమానిక దాడిని మెచ్చుకున్న బాలయ్య, ప్రభాస్ !

పుల్వామాలో జరిగిన ఉగ్ర దాడికి ప్రతీకారంగా భారతీయ వైమానిక దళం పీవోకేలోని జైషే మహ్మద్ ఉగ్రవాద శిబిరాలపై మెరుపు దాడి చేసింది.  పీవోకేలోని మూడు ఉగ్రవాద శిబిరాలపై మిరాజ్ 200 విమానాలు బాంబు దాడులు చేశాయి.  ఈ దాడుల్లో దాదాపు 300 మంది ఉగ్రవాదులు మరణించినట్టు సమాచారం.  ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేసిన ఈ దాడిని పలువురు టాలీవుడ్ ప్రముఖులు ప్రశంసించారు.    

తాజాగా నందమూరి బాలకృష్ణ స్పందిస్తూ వైమానిక దళం చేసిన ఈ దాడి యావత్ భారానికి గర్వకారణం.  మేరా భారత్ మహాన్ అన్నారు.  ఇక ప్రభాస్ కూడా ఇండియన్ ఎయిర్ ఫోర్సుకు బిగ్ సెల్యూట్ అన్నారు.  అలాగే హీరో రవితేజ, రామ్, నిఖిల్ కూడా సైనిక చర్యను ప్రశంసించారు.