బాలకృష్ణ వారసుడు.. స్టిల్ లోడింగ్

బాలకృష్ణ వారసుడు.. స్టిల్ లోడింగ్

ఇదిగో ఈ ఏడాదే వస్తాడు..  లేదు నెక్స్ట్ ఇయర్.. ఇలా సాగింది బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశంపై చర్చ ఇన్నాళ్లు.  కానీ నిన్న బయటికొచ్చిన మోక్షజ్ఞ ఫోటోలను చూస్తే ఆయన హీరోగా మారడానికి ఇంకా రెడీ కాలేదని అర్థమవుతోంది.  మొదట్లో ఎలా చబ్బీగా ఉన్నాడో  ఇప్పుడూ అలానే ఉన్నాడు.  ఇన్నాళ్లు బాలయ్య వారసుడిని తెర మీద చూడటానికి ఇంకెన్నాళ్లు పడుతుందో అని రోజులు లెక్కపెడుతూ వచ్చిన అభిమానులు సైతం ఫోటీలు చూసి అసలు సినిమా రంగంలోకి వచ్చే ఆలోచనలు అబ్బాయిలో లేనట్టుందే అని ఆందోళనపడుతున్నారు.