దిల్ రాజు నిర్మాణంలో బాలయ్య.. 27 ఏళ్ల తరువాత అలా చేస్తారా?

దిల్ రాజు నిర్మాణంలో బాలయ్య.. 27 ఏళ్ల తరువాత అలా చేస్తారా?

రెండేళ్ల క్రితం బాలీవుడ్ లో పింక్ సినిమా వచ్చింది.  ఆ సినిమా అక్కడ సంచలన విజయం దక్కించుకుంది. అమితాబ్ లాయర్ పాత్రలో మెప్పించాడు.  తాప్సికి ఈ సినిమా మంచి పేరు తెచ్చిపెట్టింది.  ఈ సినిమా తరువాత తాప్సికి అక్కడ వరసగా అవకాశాలు వస్తున్నాయి.  ఈ మూవీని తమిళంలో అజిత్ హీరోగా నెర్కొండ పార్వై పేరుతో రీమేక్ చేశారు.  

ఈ మూవీ వచ్చే నెలలో రిలీజ్ కాబోతున్నది.  సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.  ఇప్పుడు ఈ పింక్ సినిమాను తెలుగులో దిల్ రాజు రీమేక్ చేయాలని అనుకుంటున్నట్టు తెలుస్తోంది.  సీనియర్ హీరో అయితే బాగుంటుందని, అందులోను బాలకృష్ణ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నారు.  

బాలకృష్ణ 27 సంవత్సరాల క్రితం ధర్మక్షేత్రం అనే సినిమాలో లాయర్ గా చేశారు.  ఆ తరువాత మరలా లాయర్ వేషం వేయలేదు.  దిల్ రాజు బ్యానర్ కాబట్టి బాలయ్య ఈ మూవీ చేసేందుకు అంగీకరిస్తారా లేదా అన్నది తెలియాలి.