బాలకృష్ణ తరఫున వసుంధర ప్రచారం

బాలకృష్ణ తరఫున వసుంధర ప్రచారం

 హిందూపురంలో 2014 ఎన్నికల్లో కంటే ఈసారి నందమూరి బాలకృష్ణకు అధిక మెజార్టీ వస్తుందని ఆయన సతీమణి వసుంధర అన్నారు. తాము చేసిన అభివృద్ధి చూసి ప్రజలు తమను ఆదరిస్తున్నారని చెప్పారు.  బాలకృష్ణ తరఫున వసుంధర ప్రచారం చేస్తున్నారు. ధర్మపురంలో తదితర ప్రాంతాల్లో ఇంటింటా తిరుగుతూ కుంకుమ బొట్టు పెట్టి ఓటర్లను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారు.