బాలయ్య డైరెక్ట్ చేసిన 'నర్తనశాల' థియేటర్ లో రానుంది

బాలయ్య డైరెక్ట్ చేసిన 'నర్తనశాల' థియేటర్ లో రానుంది

నందమూరి నటసింహం బాలకృష్ణ నటుడిగానే కాకుండా దర్శకుడిగానూ తన ప్రతిభను చాటుకోవాలని ప్రయత్నించారు. ఆయన తండ్రి నటశిఖరం ఎన్టీఆర్ నటించిన 'నర్తనశాల' సినిమాను బాలకృష్ణ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించాలని చూసారు. ఈ సినిమాలో అర్జునిడిగా బాలయ్య నటించగా, భీముడిగా శ్రీహరి , ధర్మరాజుగా శరత్ కుమార్ నటించారు. ఇక ద్రౌపతిగా అందాలనటి సౌందర్య నటించింది. ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగానే హెలికాఫ్టర్ ప్రమాదంలో సౌందర్య కన్నుమూశారు. ద్రౌపతి పాత్రలో సౌందర్యను తప్ప మరో హీరోయిన్ ను ఉహించుకోలేమని  బాలయ్య ఏకంగా ఆ సినిమాను పక్కన పెట్టేసారు.  హీరోయిన్ అకాల మరణం కారణంగా తన కలను కూడా పక్కన పెట్టేసాడు బాలకృష్ణ. అయితే ఈసినిమా 17 నిముషాలు చిత్రీకరించారు. అభిమానుల కోరిక మేరకు 17 నిమిషాల నిడివి ఉన్న ఆ సన్నివేశాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు బాలయ్య . విజయదశమి కానుకగా ఎన్బీకే థియేటర్ లో శ్రేయాస్ ఈటి ద్వారా విడుదల చేయనున్నారు.  ఎన్నాళ్ళనుండో నర్తనశాల సన్నివేశాలు చూడలనుకుంటున్న మీ కోరిక ఈ నెల 24న నెరవేరబోతోంది. ఈ చిత్రం ద్వారా వసూలైన మొత్తంలో కొంత భాగాన్ని చారిటీస్ కు ఉపయోగించడానికి నిర్ణయించుకున్నాను అని బాలకృష్ణ వెల్లడించారు.