బాలాపూర్ ఏఎస్సై మృతి
హైదరాబాద్ బాలాపూర్ పోలీస్ స్టేషన్ ఏఎస్సై నర్సింహులు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. వారం రోజులుగా ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న నర్సింహులు పరిస్థితి విషమించడంతో మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. వారం రోజుల క్రితం ఓ ఫంక్షన్లో ఏఎస్సై ఆడి,పాడడం, ఆ విజువల్ వైరల్ కావడంతో ఉన్నతాధికారులు అతన్ని సస్పెండ్ చేశారు. దీన్ని తట్టుకోలేక పెట్రోల్ పోసి నిప్పంటించుకున్న ఏఎస్సైని...సహచరులు ఆస్పత్రిలో చేర్చారు. ఇక సర్వీసులో తాను ఏ తప్పూ చేయకపోయినా... పై సిబ్బంది తనను తీవ్రంగా వేధించారని ఆరోపించారు ASI నర్సింహ.
ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోవడానికి ముందు ఆయన కొన్ని విషయాలు మాట్లాడారు. సైదులు అనే ఇన్స్పెక్టర్ తనపై కక్ష సాధించారని విమర్శించారు. ఫంక్షన్ లో జరిగిన చిన్న ఘటన ఆధారం చేసుకొని si, ci తో పాటు కానిస్టేబుల్ కూడా తనను బెదిరించినట్టు చెప్పారు నర్సింహ. పై అధికారులకు తప్పుడు నివేదికలుు ఇచ్చి తనను ట్రాన్స్ఫర్ చేయించారని విమర్శించారు. వారం రోజుల క్రితం ఓ ఫంక్షన్లో ఏఎస్సై ఆడి,పాడడం, ఆ విజువల్ వైరల్ కావడంతో.. ఉన్నతాధికారులు అతన్ని సస్పెండ్ చేశారు. దీన్ని తట్టుకోలేక పెట్రోల్ పోసి నిప్పంటించుకున్న ఏఎస్సైని సహచరులు ఆస్పత్రిలో చేర్చారు.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)