తేజశ్రీ కుటుంబాన్ని పరామర్శించిన బాలినేని తనయుడు ! 

తేజశ్రీ కుటుంబాన్ని పరామర్శించిన బాలినేని తనయుడు ! 

ప్రకాశం జిల్లా ఒంగోలులో ఆత్మహత్యకు పాల్పడిన ఇంజనీరింగ్ విద్యార్థిని తేజశ్రీ కుటుంబాన్ని మంత్రి బాలినేని తనయుడు ప్రణీత్ పరామర్శించారు. ఒంగోలు గొడుగుపాలెంలోని తేజశ్రీ ఇంటికి వెళ్లిన ప్రణీత్ విద్యార్థిని ఆత్మహత్యకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. తేజశ్రీ ని ఫీజుల కోసం వత్తిడి చేసిన క్వీస్ కాలేజీ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. తేజశ్రీ తల్లిదండ్రులకు లక్ష రూపాయలు ఆర్థిక సాయాన్ని బాలినేని ప్రణీత్ అందించారు. విద్యార్థులపై ఫీజుల కోసం వత్తిడులు చేసే కాలేజీలపై చర్యలు తీసుకుంటామని బాలినేని ప్రణీత్ చెప్పారు.

ఇక మరో పక్క తేజశ్రీ ఆత్మహత్యకు కారణమైన క్వీస్ కాలేజీపై చర్యలు తీసుకోవాలని కోరుతూ విద్యార్థి సంఘాలు రేపు ప్రకాశం జిల్లాలో విద్యా సంస్థలు బంద్ కి పిలుపునిచ్చాయి. డిగ్రీ, ఇంజనీరింగ్ కాలేజీలు బంద్ పాటించాలని విద్యార్థి సంఘాలు కోరాయి. తేజశ్రీ ఆత్మహత్యపై ఒంగోలులో విద్యార్థి సంఘాలు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించాయి. సమావేశంలో ఫీజుల కోసం విద్యార్థులపై వత్తిడిలు చేస్తున్న కాలేజీ యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రేపు జిల్లా వ్యాప్తంగా డిగ్రీ, ఇంజనీరింగ్ కాలేజీలు పూర్తిగా బంద్ పాటించాలని పిలుపునిచ్చారు.