ఆ విషయాన్ని మోడీ దృష్టికి జగన్‌ తీసుకెళ్లారు

ఆ విషయాన్ని మోడీ దృష్టికి జగన్‌ తీసుకెళ్లారు

విద్యుత్‌ పీపీఏలను సమీక్షిస్తామని ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. సెక్రటేరియట్ రెండో బ్లాకులోని తన ఛాంబర్లో ఇవాళ ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యుత్‌ పీపీఏలను కేంద్రం సమీక్షించవద్దన్న విషయాన్ని ప్రధాని మోడీ దృష్టికి సీఎం జగన్ తీసుకెళ్లారని చెప్పారు. తప్పులుంటే సమీక్షిస్తామని ప్రధానికి వివరించారని తెలిపారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన బాలినేని..వన్య ప్రాణి సంరక్షణకు సంబంధించిన రెండు కమిటీల ఫైల్‌పై తొలి సంతకం చేశారు. గతంలో వైఎస్సార్ దగ్గర.. ఇప్పుడు ఆయన తనయుడు జగన్ దగ్గర మంత్రిగా పని చేయడం ఆనందంగా ఉందని అన్నారు. పగటి పూట రైతులకు విద్యుత్ సరఫరా చేసే దిశగా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని, ఆక్వా రైతులకు ఇచ్చే విద్యుత్ రాయితీని పొడిగిస్తున్నామని వివరించారు.