శారిడాన్ తో  పాటు 327 ఔషధాల నిషేధం

శారిడాన్ తో  పాటు 327 ఔషధాల నిషేధం

ఫిక్స్‌డ్ డోస్ కాంబినేషన్ (ఎఫ్ డీసీ) డ్రగ్స్ విషయంలో ఫార్మా కంపెనీలకు, ప్రభుత్వాలకు మధ్య సాగుతున్న వివాదం మరో మలుపు తిరిగింది. శారిడాన్, చర్య వ్యాధులకు వాడే పాన్ డెర్మ్ తో పాటు డయాబెటిక్స్ తో బాధపడేవారు వాడే గ్లూకోనార్మ్ పీజీని కూడా ప్రభుత్వం  నిషేధించింది. యాంటిబయాటిక్స్ మందు లుపిడిక్లాక్స్, టాక్సిమ్ ఏజడ్ తో పాటు మొత్తం 344 ఎఫ్ డీసీ మందులను ప్రభుత్వం నిషేధింది. వివిధ కంపెనీలు దాదాపు 6000 బ్రాండ్లతో ఈ ఔషధాలను అమ్ముతున్నారు. ప్రభుత్వ చర్యతో ఈ బ్రాండ్ల అమ్మకాలు ఆగిపోనున్నాయి. 2016 నుంచి ఫార్మా కంపెనీలు, ప్రభుత్వం మధ్య ఈ ఔషధాల విషయంలో వివాదం నడుస్తోంది. వ్యవహారం కోర్టుల దాకా వెళ్ళింది. గత ఏడాది డిసెంబరులో ఈ ఔషధాల విషయాన్ని పరిశీలించాల్సిందిగా డ్రగ్స్ టెక్నికల్ అడ్వయిజరీ బోర్డ్ (డీట్యాబ్) ను కోరింది. ఈ ఔషధాల కాంబినేషన్లను పరిశీలించిన డీ ట్యాబ్ వీటిని నిషేధించడం సబబేని తేల్చింది. ఇవి వాడటం వల్ల ప్రజల ఆరోగ్యానికి మరింత  నష్టం జరుగుతుందని తేల్చింది. అయితే తాజా నిషేధం నుంచి ఫెన్సిడైల్ దగ్గు మందు, డి కోల్డ్ టోటల్, కోరెక్స్ తప్పించుకున్నాయి.