మోడీది మేకిన్ ఇండియా కాదు ..సేల్ ఇండియా నినాదం

మోడీది మేకిన్ ఇండియా కాదు ..సేల్ ఇండియా నినాదం

మోడీ ది మేకిన్ ఇండియా కాదు ..సేల్ ఇండియా నినాదం అని రాజ్యసభ సభ్యుడు బండ ప్రకాష్ తెలిపారు. పెట్టుబడుల ఉపసంహరణతో ఇప్పటికే రెండున్నర లక్షల ఉద్యోగులు రోడ్డున పడ్డారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సంఖ్యను 51 శాతం పెంచారు. చాలా ప్రభుత్వ రంగ సంస్థల నుంచి కేంద్ర ప్రభుత్వానికి డివిడెండ్లు వస్తున్నా పట్టించుకోకుండా వాటి అమ్మకానికి మొగ్గు చూపుతున్నారు అని అన్నారు. బీజేపీ నేతలు ఇచ్చేది స్వదేశీ నినాదం ..ఎత్తుకునేది విదేశీ నినాదం అని పేర్కొన్నారు. కొత్త కార్మిక చట్టాలు ,వ్యవసాయ చట్టాల తో ప్రజలు నష్టపోయేలా చేస్తున్నారు మోడీ అని ఆరోపించారు. కూరగాయలు ఉల్లిగడ్డ లను కూడా దిగుమతి చేసుకునే పరిస్థితిని మోడీ తయారు చేశారు. దేశభక్తుల పార్టీ అని చెప్పుకునే బీజేపీ విదేశీ సంస్థల తొత్తు గా మారింది. కార్మిక వ్యతిరేక విధానాలు కేంద్రం తీసుకుంటున్నందువల్లే రేపటి సార్వత్రిక సమ్మెకు టీఆర్ఎస్ మద్దతు అని తెలిపారు.