గవర్నర్‌గా బండారు దత్తాత్రేయ ప్రమాణ స్వీకారం

గవర్నర్‌గా బండారు దత్తాత్రేయ ప్రమాణ స్వీకారం

బీజేపీ తెలంగాణ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ.. గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్‌ నుంచి బయల్దేరి మంగళవారమే హిమాచల్ ప్రదేశ్‌ రాజధాని సిమ్లా చేరుకున్న దత్తాత్రేయ.. ఇవాళ రాజ్‌భవన్‌లో గవర్నర్‌గా ప్రమాణస్వీకారం చేశారు. హిమాచల్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆయనతో ప్రమాణం చేయించారు. ఇక, ఈ కార్యక్రమంలో సీఎం జైరాం ఠాకూర్‌తో పాలు పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొనగా.. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్.. పలువురు నేతలు హాజరయ్యారు. మరోవైపు ప్రమాణస్వీకారోత్సవం సందర్భంగా హిమాచల్ ప్రదేశ్ సంస్కృతిని ప్రతిబింబించేలా దత్తాత్రేయ టోపీని ధరించారు. ప్రమాణస్వీకారం అనంతరం నేతలు దత్తాత్రేయకు శుభాకాంక్షలు తెలిపారు.