దుబ్బాక తీర్పు టీఆర్ఎస్ కు మైండ్ బ్లాక్ కావాలి

దుబ్బాక తీర్పు టీఆర్ఎస్ కు మైండ్ బ్లాక్ కావాలి

సిద్దిపేట జిల్లాలోని మిరుదొడ్డిలో ఎన్నికల ప్రచారంలో బీజేపీ చీఫ్ బండి సంజయ్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా..బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేసారు. ఈ ఎన్నికలు దుబ్బాక ఎన్నికలు కావని.. రాష్ట్రమంతా మీ దుబ్బాక వైపు చూస్తుందన్నారు. బిజెపికి ఓటు వేసి రఘునందన్ రావును గెలిపించాలని కోరారు. సారు, కారు, పదహారు అన్నారని..కానీ ప్రజలు ఇచ్చిన తీర్పు తో కెసిఆర్ కు మాటలు రాలేదని పేర్కొన్నారు. దుబ్బాక ఫలితం కూడా అదే మాదిరిగా ఉండాలని చెప్పారు. సీఎం కెసిఆర్ ఇంట్లో కొట్లాట జరుగుతుందని..అందుకే కెసిఆర్ ఫాం హౌస్ కు వెళ్తున్నాడు..ప్రజలు గమనించాలన్నారు. ఫాంహౌస్ నుంచి పరిపాలన చేసే ఇలాంటి ముఖ్యమంత్రి మనకు అవసరం లేదని..దుబ్బాక తీర్పు టీఆర్ఎస్ కు మైండ్ బ్లాక్  కావాలని తెలిపారు.