ఏ క్షణంలోనైనా కేసీఆర్ సర్కార్‌ కూలిపోతుంది..

ఏ క్షణంలోనైనా కేసీఆర్ సర్కార్‌ కూలిపోతుంది..

ఏ క్షణంలోనైనా కేసీఆర్ సర్కార్‌ కూలిపోతుంది అంటూ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్... మీది గల్లీ పార్టీ కూడా కాదు గడీల పార్టీ అంటూ ఎద్దేవా చేసిన ఆయన.. మీ మంత్రుల, ఎమ్మెల్యే ల వల్లనే నీ ప్రభుత్వం ఏ క్షణంలో నైనా కూలుతుంది అంటూ హాట్‌ కామెంట్లు చేశారు. ఎన్నినిధులు ఇచ్చావ్ పాత బస్తీకి.. మెట్రోని అడ్డుకుంది ఎవరు..? అని ప్రశ్నించిన బండి.. వరద నష్టం అంచనా వేశావా అని ప్రశ్నించారు. జీహెచ్‌ఎంసీ ఆదాయాన్ని ఎందుకు పెంచడం లేదు అని నిలదీశారు. 6 లక్షల మంది కి 10 వేలు ఇచ్చానని అంటున్నావు... డివిజన్లలో తిరుగుతున్న అభ్యర్థులు 10 వేలు పంచిన లిస్ట్ ఎందుకు చూపించడం లేదు అంటూ ఎదురుదాడి చేశారు. దున్నపోతుల లెక్క ఒక్కొక్కడు జేబులు నింపుకున్నారని మండిపడ్డారు.

సీఎం కేసీఆర్ కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది అంటూ సంచలన కామెంట్లు చేసిన బండి సంజయ్.. పోయిన సారి కన్నా 6 సీట్లు ఎక్కువ వస్తాయని అంటున్నాడు.. మరి మిగతా సీట్లలో ఎవరు గెలుస్తారు..? ఎంఐఎంకి ఇస్తున్నావా? ఎంఐఎంకి సంబంధం లేదని అంటున్నారు.. మరి.. నిజామాబాద్‌లో ఉన్నసంబంధం ఏంటి? అక్రమ సంబందమా? అంటూ ప్రశ్నించారు. పాత బస్తీలో మీ అభ్యర్థుల గెలుపు కోసం ఎందుకు ప్రచారం చేయలేదు.. హైదరాబాద్ ప్రశాంతంగా లేదు.. సంఘ విద్రోహ శక్తుల అడ్డాగా మారింది అని వ్యాఖ్యానించారు. ప్రశాంత భాగ్యనగరం కావాలంటే బీజేపీ రావాలి అన్న బీజేపీ అధ్యక్షడు.. నీ అవినీతిని బయటపెడతాం.. నీ పతనం ప్రారంభం అయ్యిందన్నారు.