కేటీఆర్ ను సీఎంను చేయాలని టీవీలు పగులుతున్నాయట : బండి సంజయ్

కేటీఆర్ ను సీఎంను చేయాలని టీవీలు పగులుతున్నాయట : బండి సంజయ్

త్వరలో తెలంగాణలో కేటీఆర్ సీఎం అవుతారన్న ఊహాగానాల నేపధ్యంలో దానికి సంబంధించి బీజేపీ రాష్ట్ర అధ్యక్ష్యుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నిన్న అకస్మాత్తుగా కాళేశ్వరం సీఎం వెళ్ళాడని అది కూడా శ్రీమతిని తీసుకొని వెళ్ళాడని, తన కల సాకారం అయింది అని పోయిండని అంటున్నారని అన్నారు. మూడు రోజులుగా ఆయన తన ఫార్మ్ హౌస్ లో కేసీఆర్ దోష నివారణ పూజలు చేశారని, వాటిని కలపడానికి మాత్రమే కాళేశ్వరం వెళ్ళాడని సంజయ్ విమర్శించారు. తన కొడుకును సీఎం చేయడానికే కాళేశ్వరం వెళ్ళాడన్న ఆయన కేసీఆర్ తన స్వార్థం కోసమే యాగాలు పూజలు చేస్తున్నాడని అన్నాడు.

తెలంగాణ ప్రజలకు అన్నీ తెలుసని, అకస్మాత్తుగా ఎందుకు వెళ్ళాడు అనే అనుమానం అందరికి వచ్చిందని అన్నారు. నటించడం,అబద్ధాలు చెప్పడం,మోసం చేయడంలో కేసీఆర్ దిట్ట అని అన్నారు. మరో సారి సీఎం తెలంగాణ ప్రజలను మోసం చేశాడన్న ఆయన అధికారంలోకి వస్తే దేశ ప్రజల భాగస్వామ్యం తో భాగ్యనగర్ లో 125 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని అన్నారు అది ఏమైందని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారిని కాకుండా కొడుకును సీఎం చేస్తున్నాడని దళితుణ్ణి సీఎం ఎందుకు చేయడం లేదు ? అని ప్రశ్నించారు.

ఈటెల , హరీష్ లకు అన్యాయం చేసాడన్న అయన కరోన టైం లో సీఎం ఈటల ను బద్నామ్ చేసాడని అన్నారు. సీఎం కాళేశ్వరం ఎందుకు వెళ్ళాడో టీఆర్ఎస్ ఎమ్మెల్యే లే నాకు చెప్పారన్న ఆయన, టీఆర్ఎస్ లో ఉన్నతెలంగాణ ఉద్యమ ద్రోహులే కేటీఆర్ సీఎం కావాలని అంటున్నారని అన్నారు. ఇంట్లో పూజలు ఉన్నాయి కాబట్టే ఈ రోజు కేటీఆర్ తన కార్యక్రమాలు రద్దు చేసుకున్నారని అన్నారు. కేటీఆర్ ను సీఎంను చేయాలని.. పగ్రతి భవన్లో చాలా టీవీలు పగులుతున్నాయన్న ఆయన టీవీలు పగులుతోన్న విషయాన్ని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే చెప్తున్నారని అన్నారు.