కేసీఆర్ మానవత్వం లేని మానవ మృగం : బండి సంజయ్

కేసీఆర్ మానవత్వం లేని మానవ మృగం : బండి సంజయ్

ప్రైవేట్ ఉధ్యోగుల గురించి బీజేపీ పోరాడుతూ ఉందని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ప్రైవేటు టీచర్ల కోసం ఆందోళన చేస్తే 15 రోజుల పాటు జైల్లో పెట్టారనన్న ఆయన అయినా ఏనాడూ భయపడలేదని అన్నారు. ముఖ్యమంత్రి సోయిలేకుండా వ్యవహరిస్తున్నారన్న ఆయన ప్రైవేటు స్కూల్ లకూ ఏదైనా స్కీం ఇవ్వండి, చిన్న చిన్న పాఠశాల ల యజమానులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ప్రైవేటు స్కూల్ యాజమాన్యాలతో చర్చించే దమ్ముందా ? అని ప్రశ్నించిన ఆయన ప్రైవేటు టీచర్లు పేదోళ్ళు ... వారికి ఏమైనా ముఖ్యమంత్రి స్పందించరని అన్నారు.

పేదోళ్ళకు ఏమైనా కేసీఆర్ కనీసం స్పందించరని మానవత్వం లేని మానవ మృగం కేసీఆర్ అని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రైవేటు ఉద్యోగుల సమస్యలు పరిష్కారం చూపక పోతే రాబోయే ఎన్నికల్లో వారి సత్తా చూపిస్తారని ఆయన అన్నారు. తెలంగాణ లో ఏ ఒక్కరు సంతోషంగా లేరన్న ఆయన తెలంగాణ రాష్ట్రం లో ఏం జరగబోతోందో ఆలోచించాలని అన్నారు. రెవెన్యూ ఉధ్యోగులు కూడా బీజేపీ తో డైరీ ఆవిష్కరణ చేయించారని అన్నారు. కొడుకు ను ముఖ్యమంత్రి చేసేందుకు యాగం చేసి .. ద్రవాలు కాళేశ్వరం లో కలిపారని, అది కాక పోతే ఎందుకు ఖండించడం లేదు అని ఆయన ప్రశ్నించారు.

24 గంటల్లో సినిమా అయిపోగొడుతరు.. హౌజ్ ఫుల్.. కలెక్షన్స్ ఫుల్, సినిమా డైరెక్టర్.. నిర్మాతలకు విజ్ఞప్తి చేస్తున్న కేసీఆర్ లాంటి గొప్ప నటుడితో సినిమా తియ్యండం అంటూ ఆయన ఎద్దేవా చేశారు. అఖల్ ఉన్నోడు ఎవడూ.. అఖల్ లేనోడితో పొత్తు పెట్టుకోరు అని ఆయన అన్నారు. కేటీఆర్ తరువాత ముఖ్యమంత్రి అని ఎన్నికల కు వెళ్ళే దమ్ము మీలో ఉందా ? అని ఆయన ప్రశ్నించారు. కేటీఆర్ ఒక్కడే ముఖ్యమంత్రి అయితడా.. మిగతా వారు ఉధ్యమం చేయలేదా ? అని ఆయన అన్నారు. కేటీఆర్ ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నట్లు చెబుతున్నారు, ప్రజల్లో చర్చ పెట్టు..  ఎవరు కోరుకుంటున్నారో తెలుస్తుందని అన్నారు.