సరే ఇప్పుడు ఏం చేయమంటారు...

సరే ఇప్పుడు ఏం చేయమంటారు...

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేడి ముగిసింది.. ఎన్నికల ప్రచార సమయంలో సవాళ్లు.. ప్రతి సవాళ్లు విసురుకున్న నేతలు... ఇప్పుడు కూల్ అయిపోయారు. ఇక ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోతే గొంతు కోసుకుంటానంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన బంగ్ల గణేష్‌... ఇవాళ తన వ్యాఖ్యలపై స్పందించారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఇవాళ ఉదయం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న ఆయన అనంతరం మీడియాతో మాట్లాడుతుండగా... గొంతు కోసుకుంటానన్న వ్యాఖ్యలను మీడియా ప్రతినిధితులు ప్రస్తావించారు... దీనికి బదులిచ్చిన బంగ్ల గణేష్‌.. కోపంలో చాలా మంది చాలా అంటారు. అవన్నీ అవుతాయా? మా పార్టీ కార్యకర్తల్లో కాన్ఫిడెన్స్ నింపడానికి అలా అన్నాను. ఆ కాన్ఫిడెన్స్ కాస్త ఓవర్ కాన్ఫిడెన్స్ అయ్యిందన్నారు. ఇదే సందర్భలో మరి ఇప్పుడు ఏం చేయమంటారు? గొంతు కోసుకోమంటారా? అంటూ ఎదురు ప్రశ్నించారు. ఇక ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచి అజ్ఞాతంలో ఉన్నారన్న వార్తలపై స్పందించిన ఆయన... తాను అజ్ఞాతంలో ఉన్నానని అంటున్నారు. నేనేం అజ్ఞాతంలో లేను. మేం ఊహించని విధంగా మా పార్టీ ఓడిపోయింది కాబట్టి మానసికంగా బాధతో ఉన్నాం. ఇలాంటప్పుడు ఏం మాట్లాడతాంలే.. అందుకే కొంత కాలం మౌనంగా ఉండాలి అనుకున్నామన్నారు.