పవన్ కు జై కొట్టిన బండ్ల... దానికోసమేనా? 

పవన్ కు జై కొట్టిన బండ్ల... దానికోసమేనా? 

ఒకప్పుడు పవన్ కళ్యాణ్ కు వీర విధేయుడిగా ఉన్న బండ్ల గణేష్, పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టిన తరువాత ఆ పార్టీలో జాయిన్ అవుతారని అనుకున్నారు.  కానీ, పవన్ పార్టీలో కాకుండా అయన కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి షాక్ ఇచ్చారు.  కాంగ్రెస్ లో జాయిన్ అయినా అక్కడ రాణించలేకపోయారు.  అక్కడి నుంచి తిరిగి మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమాతో సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు.  

అయితే, పవన్ కళ్యాణ్ ట్విట్టర్ లో పోస్ట్ చేసిన ఓ ఫోటోను బండ్లగణేష్ షేర్ చేశారు.  ఆ ఫోటోపై నేను భయంతో రాలేదు.. బాధ్యతతో వచ్చాను అని రాసుంది.  ఇది నిజం అంటూ బండ్లగణేష్ షేర్ చేయడంతో ఆసక్తిగా మారింది.  గబ్బర్ సింగ్ వంటి మంచి హిట్ సినిమా తీసిన బండ్ల గణేష్ మరలా సినిమా ఇండస్ట్రీలో సినిమాలు నిర్మించేందుకు సిద్ధం అవుతున్నారని అనుకోవచ్చు.  పవన్ కళ్యాణ్ తో ఛాన్స్ దొరికితే సినిమా తీయడానికి గణేష్ ప్లాన్ చేసుకుంటున్నారని అనుకుంటున్నారు.  

ఇండియన్ ఆర్మీతో మహేష్ బాబు స్పెషల్ చిట్ చాట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి  

 

ఇది నిజం @PawanKalyan ????????✊???? pic.twitter.com/fuddEqbV4Y