గబ్బర్ సింగ్ కాంబినేషన్లో సినిమా...?

గబ్బర్ సింగ్ కాంబినేషన్లో సినిమా...?

గబ్బర్ సింగ్... పవన్ కళ్యాణ్ కు మంచి జోష్ ఇచ్చిన సినిమా.  గబ్బర్ సింగ్ గా పవన్ తన నట విశ్వరూపాన్ని ప్రదర్శించాడు.  అప్పట్లో రికార్డులను తిరగరాసింది ఈ సినిమా.  బాలీవుడ్ లో హిట్టైన దబాంగ్ సినిమాకు ఇది రీమేక్.  హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను బండ్ల గణేష్ నిర్మించారు.  ఆ తరువాత కొన్ని సినిమాలు చేసిన పవన్ అజ్ఞాతవాసి తరువాత సినిమాలను పక్కన పెట్టి పార్టీ పనుల్లో బిజీ అయ్యారు.  ఇటీవలే జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి పరాజయం పాలైన పవన్... తిరిగి సినిమాల్లోకి రావాలని అయన ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.  

ఫ్యాన్స్ తో పాటు నిర్మాతలు కూడా పవన్ సినిమాల్లోకి రావాలని అంటున్నారు.  గబ్బర్ సింగ్ నిర్మాత బండ్ల గణేష్ ఓ అడుగు ముందుకేసి పవన్ కోసం అప్పుడే స్క్రిప్ట్ కూడా రెడీ చేయించాడని తెలుస్తోంది.  పవన్ ను కలిసి స్క్రిప్ట్ వినిపిస్తామని.. పవన్ తప్పకుండా సినిమాల్లోకి వస్తాడని అంటున్నారు.  పవన్ సన్నిహితుల సమాచారం ప్రకారం... రాజకీయాల్లోనే ఉంటాడని, సినిమాల్లోకి వచ్చే ఉద్దేశ్యం లేదని అంటున్నారు.