నాకు రాజకీయాలకు సంబంధమే లేదు..

నాకు రాజకీయాలకు సంబంధమే లేదు..

బండ్ల గణేష్ ..టాలీవుడ్ లో పరిచయం అక్కర్లేని వ్యక్తి . క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలు చేసి ఆతర్వాత ప్రొడ్యూసర్ గా మారారు . ఆంజనేయులు సినిమాతో నిర్మాతగా అవతారమెత్తారు . ఆతర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా 'తీన్మార్' అనే సినిమా నిర్మించి నష్టపోయిన గణేష్.. గబ్బర్ సింగ్ సినిమాతో కాసుల పండగ చేసుకున్నాడు. ఆ తర్వాత అల్లు అర్జున్ హీరోగా ఇద్దరమ్మాయిలతో ఎన్టీఆర్ హీరోగా 'బాద్షా' 'టెంపర్' సినిమాలు నిర్మించి టాప్ ప్రొడ్యూసర్ అయ్యాడు. అనంతరం మళ్లీ ఆషీకీ-2 తెలుగులో 'నీ జతగా నేనుండాలి ' పేరుతో రీమేక్ చేసి ప్లాప్ అందుకున్నాడు. ఆ సినిమా తర్వాత రాజకీయాల్లోకి వెళ్ళిపోయిన గణేష్..అక్కడ కూడా ఫ్లాప్ అవ్వడంతో తిరిగి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారి మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమాలోనటించారు.మరోసారి నిర్మాతగా మారి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా చేస్తున్నాడు. మెగా ఫ్యామిలిలో ఇప్పటికే మూడు సినిమాలకు అడ్వాన్స్లు ఇచ్చాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఇది ఇలా ఉండగా... బండ్ల గణేష్‌ తాజాగా ఓ ట్వీట్‌ చేశాడు. ఇది ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. "నాకు ఏ రాజకీయ పార్టీలతో ఏ రాజకీయాలతో సంబంధం లేదు .నేను రాజకీయాలకు దూరం .దయచేసి గతంలో  మాట్లాడిన మాటల్ని ఇప్పుడు పోస్ట్ చేయొద్దు. ఇది నా అభ్యర్థన మీ బండ్ల గణేష్ " అంటూ గణేష్‌ ట్వీట్‌ చేశారు. గ్రేటర్‌ ఎన్నికల నేపథ్యంలో ఆయన ఈ ట్వీట్‌ చేసినట్టు తెలుస్తోంది.