ఫీల్డింగ్ ఎంచుకున్న ఆర్సీబీ

ఫీల్డింగ్ ఎంచుకున్న ఆర్సీబీ

మరికొద్ది సేపట్లో బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో ముంబయి ఇండియన్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు మధ్య మ్యాచ్‌ జరగనుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. బెంగళూరు జట్టు ఎలాంటి మార్పులు చేయకుండా బరిలోకి దిగుతోంది. మరోవైపు ముంబై జట్టులోకి పేసర్ జస్ప్రిత్‌ బుమ్రా, లసిత్ మలింగలు వచ్చారు. 

జట్లు:

రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు: 
విరాట్ కోహ్లీ (కెప్టెన్‌), పార్థివ్ పటేల్ (వికెట్‌ కీపర్‌), మొయిన్ అలీ, ఏబీ డివిలియర్స్, హెట్‌మేర్‌, శివం దుబే, గ్రాండ్‌హోమ్‌, నవదీప్ సైనీ, యుజువేంద్ర చాహల్, ఉమేశ్‌ యాదవ్, మహమ్మద్ సిరాజ్.

ముంబయి ఇండియన్స్‌:

రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), క్వింటన్‌ డికాక్ (వికెట్‌ కీపర్‌), సూర్యకుమార్ యాదవ్, యువరాజ్ సింగ్, కీరన్ పొలార్డ్, హార్దిక్‌ పాండ్య, క్రునాల్ పాండ్య, మిచెల్ మెక్లెనగన్‌, జస్ప్రిత్‌ బుమ్రా, లసిత్ మలింగ, మయాంక్ మార్ఖండేయ.