ఓపెనర్ల హవా.. రాయల్ విక్టరీ

ఓపెనర్ల హవా.. రాయల్ విక్టరీ

ఐపీఎల్‌-11లో భాగంగా కింగ్స్‌ ఎలెవన్ పంజాబ్‌, రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు జట్టు 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 89 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని బెంగళూరు జట్టు కేవలం 8.1 ఓవర్లలో వికెట్‌ కోల్పోకుండా ఛేదించింది. బెంగుళూరు ఓపెనర్లు విరాట్‌ కోహ్లి(48 నాటౌట్‌; 28 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక‍్సర్లు), పార్థీవ్‌ పటేల్‌(40నాటౌట్‌; 22 బంతుల్లో 7 ఫోర్లు)లు చెలరేగి  జట్టుకు సునాయాస విజయాన్ని అందించారు. ఇక బెంగుళూరు మిగిలిన రెండు మ్యాచ్‌లలో కచ్చితంగా గెలువాలి. అదే సమయంలో మిగతా జట్ల ఫలితాలపై బెంగళూరు ప్లే ఆఫ్ అవకాశాలు ఆధారపడి ఉన్నాయి. మరోవైపు హైదరాబాద్(18), చెన్నై(16) ఇంతకుముందే అర్హత సాధించగా.. మిగిలిన రెండు బెర్తుల కోసం తీవ్ర పోటీ నెలకొన్నది.

అంతకుముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌ చేసిన పంజాబ్‌ 15.1 ఓవర్లలో 88 పరుగులకే ఆల్ అవుట్ అయింది. బెంగళూరు బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో.. పంజాబ్‌ ఆటగాళ్లు ఏడుగురు సింగల్ డిజిట్ కే పరితమయ్యారు. రాహుల్‌(21), గేల్‌(18), ఫించ్‌(26) ఫర్వాలేదనిపించారు. బెంగళూరు పేసర్‌ ఉమేశ్‌ యాదవ్‌ మూడు వికెట్లు  తీసాడు.