నాగార్జున కూడా ఎన్నికల తర్వాతే !

నాగార్జున కూడా ఎన్నికల తర్వాతే !

సీనియర్ స్టార్ హీరో నాగార్జున తన తర్వాతి సినిమాలను వరుసగా సిద్ధం చేసుకుంటున్నారు.  ఇప్పటికే 'మన్మథుడు 2' సినిమాకు రెడీ అయిన ఆయన 'బంగార్రాజు' ప్రాజెక్టుపై కూడా ఒక కన్నేసి ఉంచారు.  'సోగ్గాడే చిన్ని నాయన'కు కొనసాగింపుగా వస్తున్న ఈ చిత్రాన్ని కళ్యాణ్ కృష్ణ కురసాల డైరెక్ట్ చేయనున్నాడు.  ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ ఫైనల్ దశలో ఉంది.  ఏపీ ఎన్నికలు ముగిశాక జూన్ నెలలో ఈ సినిమా మొదలవుతుందట.  ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జున నిర్మించనున్నారు.