బంగ్లా కోచ్‌గా భారత మాజీ క్రికెటర్‌

బంగ్లా కోచ్‌గా భారత మాజీ క్రికెటర్‌

భారత జట్టు మాజీ ఓపెనర్‌, రంజీ దిగ్గజం వసీం జాఫర్‌ కొత్త ఇన్నింగ్స్‌ ప్రాంరభించబోతున్నాడు. 'బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు'కు బ్యాటింగ్‌ కోచ్‌గా సేవలందించనున్నాడు. బంగ్లాదేశ్‌లోని హై పెర్ఫార్మెన్స్‌ క్రికెట్‌ అకాడమీలో యువ క్రికెటర్లకు జాఫర్‌ తర్ఫీదునిస్తాడు. ఇందుకు సంబంధించి జాఫర్‌తో బంగ్లా క్రికెట్‌ బోర్డు డీల్‌ కుదుర్చుకుంది. ఈ నెల నుంచి 2020 ఏప్రిల్‌ వరకూ మిర్పూర్‌లోని అకాడమీలో అండర్‌-16, అండర్‌-19 జట్లలోని యువ క్రికెటర్లకు జాఫర్‌ శిక్షణనిస్తాడు. తనకు ఇదో మంచి అవకాశమని జాఫర్‌ పేర్కొన్నాడు. భారత్‌ తరఫున 31 టెస్టు మ్యాచ్‌లు ఆడిన జాఫర్‌ 1,944 పరుగులు చేశాడు. అత్యధిక వ్యక్తిగత స్కోరు 212.