అండర్ -19 వరల్డ్ కప్ బంగ్లాదేశ్ వశం     

అండర్ -19 వరల్డ్ కప్ బంగ్లాదేశ్ వశం     

అండర్ -19 వరల్డ్ కప్ ను బంగ్లాదేశ్ జట్టు వశం చేసుకుంది. దక్షిణాఫ్రికలోని పోచెఫ్‌స్ట్రూమ్‌ లో బంగ్లాదేశ్ వర్సెస్ భారత్ జట్ల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ లో మూడు వికెట్ల తేడాతో బంగ్లాదేశ్ విజయం సాధించింది. డక్ వర్త్ లూయిస్ పద్దతిలో బంగ్లాదేశ్ జట్టు గెలుపొందింది. అయితే మ్యాచ్ చివరిలో ఉండగా వర్షంతో అంతరాయం ఏర్పడింది. వర్షం రావడంతో భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ జట్ల జరుగుతున్న మ్యాచ్ కాసేపు నిలిచిపోయింది. ఆట నిలిచిన సమయానికి బంగ్లాదేశ్ స్కోరు 41 ఓవర్లకు ఏడు వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. బంగ్లాదేశ్ జట్టు విజయానికి 15 పరుగుల దూరంలో ఉంది. డక్ వర్త్ లూయిస్ ప్రకారం 18 రన్స్ ముందంజలో ఉన్న బంగ్లాదేశ్ కు 27 బాల్స్ లో 6 రన్స్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ పరిస్థితులలో అండర్ -19 వరల్డ్ కప్ ను  బంగ్లాదేశ్ జట్టు సొంతం చేసుకుంది. అయితే ఇలా ఫైనల్ కప్ అందుకోవడం బంగ్లాదేశ్ కి ఇదే తొలిసారి.