బంగ్లా-కివీస్ మ్యాచ్ లో అంతా గందరగోళం...

బంగ్లా-కివీస్ మ్యాచ్ లో అంతా గందరగోళం...

ప్రస్తుతం బంగ్లాదేశ్- న్యూజిలాండ్ మధ్య మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే అందులో భాగంగా ఈ రెండు జట్ల మధ్య నిన్న జరిగిన రెండో టీ20లో టార్గెట్ ‌పై క్లారిటీ లేకుండానే ఛేదనకు బరిలోకి దిగింది బంగ్లాదేశ్‌. వర్షం బారిన పడిన మ్యాచ్‌లో మైదానంలోని పెద్ద స్క్రీన్ ‌పై టార్గెట్‌ను16 ఓవర్లలో 148 గా చూపించారు. 9 బంతులు పడిన తర్వాత హడావిడిగా మ్యాచ్‌ రిఫరీ కంప్యూటర్‌తో కుస్తీ పట్టి డక్‌వర్త్‌ లూయిస్‌ లెక్క ప్రకారం లక్ష్యాన్ని 16 ఓవర్లలో 170గా తేల్చాడు. ఆ వెంటనే 171 పరుగులుగా ఖరారు చేశారు. చివరకు జెఫ్‌ క్రో ఇరు జట్లకు క్షమాపణలు చెప్పాడు. ఈ మ్యాచ్‌లో కివీస్‌ 28 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌పై నెగ్గి మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0 తో సిరీస్‌ దక్కించుకుంది.