టీమిండియాపై బంగ్లా కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు..

టీమిండియాపై బంగ్లా కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు..

ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్‌ 2019లో ఇవాళ మరో ఆసక్తికరమైన పోరుకు ఇటు టీమిండియా.. అటు బంగ్లాదేశ్ సిద్ధమవుతున్నాయి. గెలుపే లక్ష్యంగా ప్రణాళికలరు రచిస్తున్నాయి. ఈ సందర్భంగా టీమిండియాపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు బంగ్లాదేశ్ కెప్టెన్ మోర్తాజా... భారత జట్టుపై గెలిచేందుకు తమకు సరైన ప్రణాళికలు ఉన్నాయన్న బంగ్లా కెప్టెన్.. ఈ వరల్డ్ కప్‌లో కోహ్లీసేన చాలా బలంగా ఉంది. ఆ జట్టుతో తలపడటం అంత తేలిక కాదు. అయినా శక్తిమేర పోరాడి అన్ని విభాగాల్లో నూటికి నూరు శాతం తమ ప్రయత్నం కొనసాగుతుందన్నారు. మేం వరల్డ్ కప్‌లో ఉంటామా? లేదా? అనేది పక్కన పెడితే.. ఇప్పటి వరకు ఆడిన మ్యాచ్‌ల్లో కంటే ఈ మ్యాచ్‌లో మెరుగ్గా ఆడాల్సిఉందన్నారు. ఇక, తమ ఆల్‌రౌండర్‌ షకిబ్‌ అల్‌ హసన్‌ ఈ మెగా టోర్నీలో అద్భుతంగా రాణిస్తున్నాడు. అతడు ఏం చేయాలో అదే చేస్తున్నాడు. అతడు ఆడాల్సింది చాలా ఉంది కాబట్టి మంచి ఫలితాలే సాధిస్తాడని ఆశిస్తున్నామన్నారు మోర్తాజా. మరోవైపు గత మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ చేతిలో ఓడిపోయిన టీమిండియాను తేలికగా తీసుకోమన్న బంగ్లా కెప్టెన్... భారత జట్టు స్పిన్‌ బౌలింగ్‌పై ప్రశంసలు కురిపించారు. కుల్‌దీప్‌, చాహల్‌ బాగా రాణిస్తున్నారని చెప్పుకొచ్చాడు.